TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టు అగ్ర దంపతులు అరెస్ట్

Published on: Sat Jul 26, 2025 6:09PM

 

ఏపీలో మావోయిస్టు అగ్ర దంపతులు  సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన సీనియర్ మావోయిస్టు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్ ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు. 

మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు. చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు. కమలేష్ పై ఆంధ్రా ప్రదేశ్ లో 20 లక్షల రూపాయల రివార్డు మరియు అరుణ పై 5 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశాంఅల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది. 

వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి - 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు,  ఇతర పరికరాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌లు చేస్తున్నారని డీజీపీ  తెలిపారు. మావోయిస్టు లుగా ఉన్న వారు పునరాలోచన చేయండి హింసాత్మక ఘటనలు తో సాధించేదేమీ లేదు. మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు  గురించి అయినా ఆలోచనలు చేయండి. మీరు జన జీవన స్రవంతి లోకి వస్తే... ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డీజీపీ తెలిపారు.