డీజీపీ పిటిషన్‌పై క్యాట్ విచారణ

 

DGP Dinesh Reddy, DGP Dinesh Reddy service

 

 

తన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలన్న డీజీపీ దినేష్‌రెడ్డి పిటిషన్‌పై క్యాట్‌లో విచారణ మొదలైంది. ఈనెల 23లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది. ఈనెల 30న దినేష్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అంతకు ముందు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.