రేవంత్ ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్
Published on: Sun Dec 3, 2023 11:32AM
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయిందని అధికారులు కూడా నిర్ధారణకు వచ్చేశారా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఒక వైపు కౌంటింగ్ జరుగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


