TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్యాంపు ఆఫీసుల్లో కాదు..ప్రజల్లో కనిపించండి..పోలీసులకు డీజీపీ ఆదేశం

Published on: Fri Jul 3, 2026 8:43PM

 

రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కింది స్థాయి పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. పోలీసులు క్యాంపు కార్యాలయాలు, స్టేషన్‌లకే పరిమితం కాకుండా ఎక్కువ సమ యం ప్రజల మధ్య గడపాలని డీజీపీ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి తన పరిధిలోని ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, ఫిర్యాదులు వచ్చిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని సూచించారు."

విజిబుల్ పోలీసింగ్" ప్రతి పోలీసు అధికారికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులు కనిపిస్తేనే భద్రతపై నమ్మకం పెరుగుతుందని, నేరాల నియంత్రణలో కూడా అది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు తమ పరిధిలో తరచూ పర్యటిస్తూ ప్రజలతో ప్రత్య క్షంగా మాట్లాడాలని ఆదేశిం చారు. అధికారులు ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండా లని, వారి సమస్యలను వినడమే కాకుండా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. 

ప్రజల నుంచి పోలీసు శాఖపై వచ్చే ఫిర్యా దులను కూడా అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. విధుల్లో ప్రతిభ కనబరిచే అధికారులను ప్రత్యేకంగా గుర్తించి రివా ర్డులు, ప్రశంసలు అందిస్తా మని, అదే సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహి త్యం లేదా ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించే అధికా రులపై మాత్రం ఎలాంటి రాజీ లేకుండా కఠిన శాఖాప రమైన చర్యలు తీసుకుంటా మని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువయ్యే, విశ్వాసాన్ని పెంచే, వేగవంతమైన సేవలు అందించే పోలీసింగ్ లక్ష్యం గా ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ ఆనంద్ పలు కీలక దిశానిర్దేశాలు చేశారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి ఫీల్డ్‌లో చురుకుగా పని చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించా లని స్పష్టం చేశారు.