డిజిపిగా కొనసాగనివ్వండి ప్లీజ్
Published on: Thu Sep 26, 2013 8:45PM
.jpg)
ఈ నెల 30తో డిజిపి దినేష్ రెడ్డి పదవి కాలం ముగుస్తుండటంతో, తన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ డీజిపి క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే దీనిపై గురువారం విచారించిన క్యాట్ డీజిపి అభ్యర్ధనను తిరస్కరించింది. దినేష్ రెడ్డిని ఇక కొనసాగించబోమని ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇవ్వటంతో క్యాట్ డిజిపి కొనసాగింపును తొసి పుచ్చింది.
తన రిటైర్మెంట్ వయసు కాకుండా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి 2 సంవత్సరాల పాటు తనను పదవిలో కొనసాగనివ్వాలని డిజిపి క్యాట్‌కు తెలిపారు. సుప్రీం తీర్పు ఆధారంగానే తన నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా దినేష్ రెడ్డి పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.


