డీజీపీ దినేష్ రెడ్డి క్యాట్ లో భంగపాటు
Published on: Thu Sep 26, 2013 4:40PM
.jpg)
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న డీజీపీ దినేష్ రెడ్డి తన పదవీకాలం పొడిగించాలని పెట్టుకొన్న వినతి పత్రాన్నిప్రభుత్వాం తిరస్కరించడంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. అశోక్ సింగ్ వెర్సస్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తన పదవీ కాలం మరో రెండేళ్ళు పొడిగించాలని ఆయన కోరారు. అయితే క్యాట్ కూడా ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. మరి డీజీపీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేక ఇంతటితో ఈ వివాదాన్ని ముగించి సగౌరవంగా పదవీవిరమణ చేస్తారా అనేది త్వరలోనే తెలియవచ్చును.


