శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు
Published on: Sat Jun 24, 2023 9:48AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సదర్శదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం స్వామి వారిని 72వేల 304 మంది భక్తులు దర్శించుకున్నారు.
32 వేల 504 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చింది.


