TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Published on: Tue Aug 22, 2023 8:42AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఆగస్టు 21) శ్రీవారిని 69వేల 909 మంది దర్శించుకున్నారు. 29327 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 37లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టొకెన్లు లేని శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.