తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు
Published on: Mon Dec 11, 2023 8:33AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (డిసెంబర్ 10) శ్రీవారిని మొత్తం 73వేల 091 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 23 ంవేల 246 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.


