శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.90 కోట్లు
Published on: Wed Jul 5, 2023 7:37AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(జూలై4) శ్రీవారిని 76 వేల 254 మంది దర్శించుకున్నారు. 28 వేల 091 మంది తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక బుధవారం(జూలై5) శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది.


