TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Oct 30, 2023 9:24AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85వేల 497.

కాగా వారిలో 24వేల 873 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 41లక్షల రూపాయలు వచ్చింది.