తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Fri Aug 18, 2023 10:57AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ ఉదయం (ఆగస్టు 18) శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (ఆగస్టు 16) శ్రీవారిని 64వేల 595 మంది దర్శించుకున్నారు.
24 వేల 473 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 60లక్షల రూపాయలు వచ్చింది.


