తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Thu Aug 17, 2023 8:21AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల వేంకటేశ్వరుడిని 75వేల 776 మంది దర్శించుకున్నారు.
22 వేల 700 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం నాలుగు కోట్ల 14లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 7 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.


