తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటలు
Published on: Wed Jun 21, 2023 10:31AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
కాగా మంగళవారం (జూన్ 20) శ్రీవారికి 71 వేల 935 మంది దర్శించుకున్నారు. 31 వేల 831 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.


