తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published on: Fri Sep 1, 2023 7:04AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 59వేల 808 మంది దర్శించుకున్నారు. 25వేల 618 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
హుండీ ఆదాయం 3.60 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూ లైన్ టీబీసీ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.


