తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Mon Jul 31, 2023 11:00AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 85వేల 258 మంది దర్శించుకున్నారు.
24 వేల 451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 28లక్షల రూపాయలు వచ్చాయి. ఇక ఈ రోజు అంటే సోమవారం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు నేరుగా క్యూలైన్ లో దర్శనం పొందే అవకాశం ఉంది.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.


