శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
Published on: Fri Aug 25, 2023 7:30AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం (ఆగస్టు 24) శ్రీవారిని 67వేల 308 మంది భక్తులు దర్శించుకున్నారు.
26వేల 674 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చింది.


