తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Thu Aug 7, 2025 9:20AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఆగస్టు 7) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
బుధవారం (ఆగస్టు 6) శ్రీవారిని మొత్తం 71 వేల 144 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 889 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15 లక్షల రూపాయలు వచ్చింది.


