TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Aug 4, 2025 8:20AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ సాఆధారణంగా ఉంది.  సోమవారం (ఆగస్టు 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 3) శ్రీవారిని మొత్తం 82,628 మంది  దర్శించుకున్నారు. వారిలో 30,339 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం( 4 కోట్ల పాతిక లక్షల రూపాయలు వచ్చింది.