TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Thu Jul 31, 2025 9:07AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 31) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం (జులై 30) శ్రీవారిని మొత్తం  75 వేల 303 మంది దర్శించుకున్నారు. వారిలో  27 వేల 166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది.