తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Mon Jul 28, 2025 8:59AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జులై 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం (జులై 27) శ్రీవారిని మొత్తం 85 వేల 486 మంది దర్శించుకున్నారు. వారిలో30 వేల 929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.


