TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Sat Jul 26, 2025 9:19AM

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత కొన్ని రోజులుగా విపరీతమైన భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు తాకిడి స్వల్పంగా తగ్గింది.  శనివారం (జులై 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జులై 25) శ్రీవారిని 73 వేల 576 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 277 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది. ఇక వారాంతం కావడంతో శని, ఆదివారాలలో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది.