TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 55కోట్లు

Published on: Thu Jul 24, 2025 9:11AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత వారం రోజులతో పోలిస్తే భక్తుల తాకిడి ఒకింత తగ్గినప్పటికీ గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఇక బుధవారం (జులై 23) శ్రీవారిని మొత్తం 80 వేల 120 మంది దర్శించుకున్నారు. వారిలో  26 వేల 786 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.