TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Tue Jul 22, 2025 8:49AM

తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతున్నది.  ఆది, సోమవారాలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారం (జులై 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 19 గంటలకు పైగా సమయం పడుతోంది. ఒక సోమవారం శ్రీవారిని మొత్తం  77 వేల 481 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 612 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 96 లక్షల రూపాయలు వచ్చింది.