తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Jul 21, 2025 9:09AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత వారంతో పోల్చుకుంటే స్వల్పంగా భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం (జులై 21) ఉదయం స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆదివారం (జులై 20) శ్రీవారిని మొత్తం 87,138 మంది దర్శించుకున్నారు. వారిలో 30,099 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 33 లక్షల రూపాయలు వచ్చింది.


