TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Tue Jul 15, 2025 10:25AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జులై 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం (జులై 14) శ్రీవారిని మొత్తం 74 వేల 149 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 115 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.