TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు

Published on: Wed Jul 9, 2025 9:38AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదుగంటలకు పైగా సమయం పడుతుండగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (జులై 8) శ్రీవారిని మొత్తం 78 వేల 320 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హండీ కానుకల ఆదాయం 4 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.