తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Sat Jul 5, 2025 9:00AM
.webp)
తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. వారంతం కావడంతో తిరమలేశుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. శనివారం (జులై5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యైలైన్ఎన్ జీ షెడ్డుల వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (జులై 4) మొత్తం70 వేల 13 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 496 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.


