TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ

Published on: Thu Jul 3, 2025 9:14AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇకపోతే బుధవారం (జూలై2) శ్రీవారిని మొత్తం 74 వేల 510 మంది దర్శించుకున్నారు. వారిలో 28 వేల 050 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం  3 కోట్ల 98 లక్షల రూపాయలు.