తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Wed Jun 25, 2025 8:52AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (జూన్ 25) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 24 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (జూన్ 24) శ్రీవారిని మొత్తం 79 వేల 466 మంది దర్శించుకున్నారు. వారిలో29 వేల 227 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 5 లక్షల రూపాయలుర వచ్చింది.


