తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Mon Jun 9, 2025 9:45AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (జూన్ 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎన్ డీ షెడ్ల వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం ( జూన్ 8) శ్రీవారిని మొత్తం 90 వేల802 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల 776 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది.


