TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు

Published on: Thu Jun 5, 2025 9:29AM

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జూన్ 5) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం (జూన్ 4) శ్రీవారిని మొత్తం 78 వేల 288 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 79 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 67 లక్షల రూపాయలు వచ్చింది.