తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Jun 3, 2025 9:08AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. మంగళవారం (జూన్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం (జూన్ 2) శ్రీవారిని మొత్తం 84 వేల 418 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.


