TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలేశుని హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు

Published on: Thu May 29, 2025 9:12AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.  వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. గురువారం ( మే 29) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎటీజీహహెచ్ వరకూ సాగింది.

ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 83 వేల621 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 97 లక్షల రూపాయలు వచ్చింది.