తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Published on: Sat May 24, 2025 9:28AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవలకు తోడు వారాంతంం కూడా కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శనివారం (మే 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 74 వేల 374 మంది దర్శించుకున్నారు. వారిలో 37 వేల 477 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 2 లక్షల రూపాయలు వచ్చింది.


