TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Published on: Fri May 16, 2025 8:51AM

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసిరావడంతో తిరుమల స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (మే 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలా తోరణం వెలువలి వరకూ సాగింది.

ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని మొత్తం 63 వేల 208 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 951 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 72 లక్షల రూపాయలు వచ్చింది.