తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Published on: Thu May 15, 2025 9:02AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (మే15) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (మే 14) శ్రీవారిని మొత్తం 74 వేల 20 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 190 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.


