TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Tue May 13, 2025 9:14AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం (మే 12) శ్రీవారిని మొత్తం 89 వేల 760 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 544 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 90 లక్షల రూపాయలు వచ్చింది.