TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat May 3, 2025 9:45AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు, వారాంతం కలిసి రావడంతో భక్తులు తిరుమలేశుని దర్శనం కోసం తిరుమల గిరులకు పోటెత్తుతున్నారు. శనివారం (మే3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (మే 2) స్వామి వారిని 74 వేల 344 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 169 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చింది.