TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Fri May 2, 2025 9:04AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం సమీపిస్తుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం(మే 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్  శిలా తోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (మే 1) శ్రీవారిని మొత్తం 57 వేల 863 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 30 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 4 లక్షల రూపాయలు వచ్చింది.