తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Apr 30, 2025 9:18AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 30) శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ సాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక మంగళవారం (ఏప్రిల్ 29) శ్రీవారిని మొత్తం 64 వేల 263 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 19 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 35 లక్షల రూపా యలు వచ్చింది.


