తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Thu Apr 24, 2025 9:09AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (ఏప్రిల్ 23) శ్రీవారిని మొత్తం 8వేల 705 మంది దర్శించుకున్నారు. వారిలో 25వేల 382 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హఉండీ కానుకల ఆదాయం 3 కోట్ల 62 లక్షల రూపాయలు వచ్చింది.


