తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు
Published on: Wed Apr 23, 2025 9:20AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 23) శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
మంగళవారం (ఏప్రిల్ 22) శ్రీవారిని మొత్తం 61 వేల 828 మంది దర్శిం చుకున్నారు. వారిలో 21 వేల 165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది.


