TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Apr 21, 2025 9:49AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం లాంగ్ వీకేండ్  కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే   సోమవారం (ఏప్రిల్ 21) తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టొకోన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఏప్రిల్ 20) శ్రీవారిని మొత్తం 82 వేల 745 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 78 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 85లక్షల రూపాయలు వచ్చింది.