TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Sat Apr 19, 2025 9:33AM

 

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. శనివారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్ టీబీసీ సెంటర్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఏప్రిల్ 18) శ్రీవారిని మొత్తం 58 వేల 519 మంది దర్శించుకున్నారు. వారిలో 30 వేల 360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27లక్షల రూపాయలు వచ్చింది.