TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

Published on: Fri Apr 18, 2025 10:36AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటంతో  భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.  

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఏప్రిల్ 17) శ్రీవారిని మొత్తం 56 వేల 279 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల19 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 59లక్షల రూపాయలు వచ్చింది.