తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed Apr 16, 2025 9:38AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (ఏప్రిల్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం స్వామి వారిని మొత్తం 73 వేల 543 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 346 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానులక ఆదాయం 4 కోట్ల 22 లక్షల రూపాయలు వచ్చింది.


