TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

Published on: Tue Apr 15, 2025 9:25AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 15)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 73 వేల78 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 831 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చింది.