తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Mon Apr 14, 2025 10:14AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (ఏప్రిల్ 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 79, 100 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 791 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 52 లక్షల రూపాయలు వచ్చింది.


