తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
Published on: Sun Apr 13, 2025 8:31AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఎండీసీఏ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
ఇక శనివారం (ఏప్రిల్ 12) శ్రీవారిని మొత్తం 72 వేల 923 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల 571 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 33 లక్షల రూపాయలు వచ్చింది.


